గుంటూరు జైలు వద్ద జగన్..భారీగా వైసీపీ కార్యకర్తలు
వైసీపీ నాయకుడు జగన్ గుంటూరు జైలులో ఉన్న వైసీపీ నేత నందిగం సురేష్‌తో ములాఖత్ కానున్నారు. ఈసందర్భంగా జైలు వద్దకు రాబోతున్నారు. ఈ వార్త తెలిసిన వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. కార్యకర్తలు ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా పోలీసులు కూడా భారీగా మొహరించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత నందిగం సురేష్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించగా హైకోర్టు నిరాకరించింది. దీనితో ఆయనను అరెస్టు చేసి, 14 రోజుల రిమాండుకు గుంటూరు జైలుకు తరలించారు. దీనితో ఈ ఘటనను అప్పుడే ఖండించిన జగన్ నేడు ఆయనను కలిసి ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు.

