60 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో జడేజా భార్య రివాబా ఘన విజయం
జామ్ నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై ఆమె 61 వేలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత తొలి రౌండ్‌లో ఆమె వెనుకంజలో ఉన్నారు. తర్వాత నుంచి అన్ని రౌండ్‌లలోనూ రివాబా ఆధిక్యం ప్రదర్శించారు. ఆప్ అభ్యర్థిగా కర్షన్ బాయ్ కర్మూర్ రెండో స్థానంలో నిలవగా… కాంగ్రెస్ అభ్యర్థి బిపేంద్రసిన్హ్ చాతుర్‌సిన్హ్ మూడో స్థానంలో నిలిచారు.

ఎన్నికల్లో గెలుపు అనంతరం రివాబా జడేజా మాట్లాడుతూ… గుజరాత్‌ను మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత బీజేపీదేనన్నారు రివాబా. ఇది కేవలం తన విజయం మాత్రమే కాదన్న రివాబా… ప్రజా విజయం అన్నారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మెకానికల్ ఇంజనీర్ డిగ్రీ పూర్తి చేసిన రివాబా సోలంకి… 2016లో బీజేపీలో చేరారు. అంతేకాదు, కాంగ్రెస్ సీనియర్ నేత హరిసింగ్ సోలంకికి ఆమె బంధువు.
