‘జబర్దస్త్’ యాక్టర్‌కి ప్రమాదం…!
తెలుగు టీవీ షో “జబర్దస్త్”లో తన హాస్య పాత్రలతో పాపులర్ అయిన కమెడియన్ ఆటో రాంప్రసాద్ గురువారం (డిసెంబర్ 5) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం పట్ల అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంప్రసాద్ జబర్దస్త్ షూటింగ్‌కు వెళ్ళే మార్గంలో తుక్కుగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు ఉన్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో రాంప్రసాద్ కారు వెనక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఆ తర్వాత రాంప్రసాద్ కారు ముందు ఉన్న మరో కారును కూడా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. అయితే, అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త తెలిశాక, రాంప్రసాద్ అభిమానులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

