Home Page SliderNationalNews Alert

14 ఏళ్లుగా రాత్రి భోజనం మానేశాను.. బాలీవుడ్‌ నటుడు

గత 14 ఏళ్ళుగా తాను రాత్రుళ్ళు భోజనం చేయట్లేదని అన్నారు బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. బరువు అదుపులో పెట్టుకునేందుకు ఇదే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డారు. తన తాతను చూశాకే ఈ ఐడియా వచ్చిందని చెప్పారు. ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో అద్భుతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్నారు మనోజ్‌ బాజ్‌పాయ్‌. త్వరలో ఫ్యామిలీ మ్యాన్‌-3 షూటింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో సరదాగా ముచ్చటించారు. తన తాతగారు సన్నగా, ఫిట్‌గా ఉండేవారన్నారు. కాబట్టి, ఆయన డైట్‌ ప్లాన్‌నే ఫాలో అవుదామని నిర్ణయించుకున్నానని ఈ సందర్భంగా మనోజ్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. మొదట్లో ఇలా రాత్రుళ్ళు భోజనం మానుకోవడం కష్టంగా ఉండేదన్నారు. ఆకలితో ఇబ్బందిపడేవాడిని. దీంతో, మంచినీళ్లు తాగి, హెల్త్‌ బిస్కట్స్‌ తినేవాడిని.  నా షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ డైట్‌ ప్లాన్‌లో చిన్న చిన్న మార్పులు చేశాను. కొన్నిసార్లు 12 గంటలు, మరికొన్ని సందర్భాల్లో 14 గంటలు ఏమి తినకుండా ఉండేవాణ్ణి అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో తన ఆరోగ్యం మరింత మెరగయిందని, డయాబెటిస్‌, కొలెస్టెరాల్‌, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు సాయపడిందని మీడియాతో అన్నారు.