Breaking NewscrimeHome Page SliderTelangana

టార్గెట్‌ చేసి కేసులు పెడుతున్న‌ట్లుంది

సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఒక వ్య‌క్తి ని టార్గెట్ చేసి కేసులు పెడుతున్న‌ట్లుందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హ‌రీష్ రావు ఆరోపించారు. అల్లు అర్జున్ విష‌యంలో చూపుతున్న చొర‌వ అన్నీ విష‌యాల్లో చూపించు రేవంత్ అంటూ ఎద్దేవా చేశారు. రేవ‌తి మృతి బాధాక‌ర‌మైన‌ప్ప‌టికీ అలాంటి రేవ‌తి బిడ్డ‌లు ఈ తెలంగాణాలో 50 మందికి పైగా గురుకులాల్లో చ‌నిపోయార‌ని వారంద‌రి విష‌యంలోనూ ఇలా ఎందుకు ఉండ‌లేక‌పోతున్నార‌ని విమ‌ర్శించారు.రైతులు,విద్యార్ధులు,హైడ్రా బాధితులు దాదాపు 200 మందికి పైగా చ‌నిపోతే రేవంత్‌కి చీమ‌కుట్టిన‌ట్లు కూడా లేద‌ని ,ఇలాంటి వ్య‌క్తి తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌వ‌డం ప్ర‌జ‌ల దౌర్భాగ్య‌మ‌న్నారు.