Andhra PradeshBreaking NewsNationalNewsPolitics

వల్లభనేని, దేవినేని ఇళ్లల్లో ఐటీ సోదాలు

పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఇళ్లల్లో మంగళవారం ఉదయం నుంచే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌, నందగిరి హిల్స్‌లో ఉన్న వంశీరామ్‌ బిల్డర్స్‌కు చెందిన సుబ్బారెడ్డి ఇంట్లో, కార్యాలయంలో, ఆయన బంధువుల ఇళ్లలోనూ మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా.. మరో మూడు చోట్లా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అంతేకాదు.. విజయవాడలోని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. అవినాష్‌ బంజారాహిల్స్‌లోని తన భూమిని వంశీరామ్‌ బిల్డర్స్‌కు డెవలప్‌మెంట్‌ కోసం ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరి ఇళ్లలో సోదాలు జరిగాయి.