NewsTelangana

RS బ్రదర్స్‌లో ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ఈ రోజు ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఐటీ హైదరాబాద్‌లో ఏకంగా ఆరు చోట్ల సోదాలు చేపట్టింది. ఈ మేరకు  నగరంలోని RS బ్రదర్స్‌ షోరూంలలో ఐటీ తనిఖీలు చేసింది. మాధాపూర్,జూబ్లీహిల్స్‌తో సహా 10 చోట్ల ఈ రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. వీటిలో భాగంగా RS బ్రదర్స్ షోరూంలు,ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. అయితే RS బ్రదర్స్ ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.  కాగా RS బ్రదర్స్ హానర్స్ ఇన్‌ఫ్రా పేరుతో కార్యకలాపాలు సాగిసిస్తున్నట్లు సమాచారం. ఈ హానర్స్ సంస్థ వాసవీతో పాటు పలు ప్రాజెక్టులు కూడా చేపట్టింది. ప్రస్తుతం RS బ్రదర్స్ వాసవి ,సుమధురతో కలిసి వ్యాపారాలు చేస్తుంది. దీంతో హానర్స్ ,సుమధుర,వాసవి,ఆర్‌ఎస్ బ్రదర్స్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.