BusinessHome Page SliderNews Alerttelangana,

దిల్ రాజ్ భార్యను ఆరా తీసిన ఐటీ అధికారులు

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్‌ దిల్‌ రాజు  నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసిందే. హైదరాబాద్‌లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు చేపట్టాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూనే ఉన్నారు.  ఈ నేపథ్యంలో దిల్‌ రాజు భార్య తేజస్వినిని అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఆమె  మీడియాతో మాట్లాడుతూ..”ఇవాళ ఉదయం నుండి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం”. అని పేర్కొన్నారు.  దిల్‌ రాజు నివాసాలతోపాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితరెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.