యాదగిరిగుట్టలో దారుణం
వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్‌లో బుధవారం దారుణం చోటు చేసుకుంది .పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధినిలను ప్రిన్సిపాల్ చావబాదింది. జావ తాగే సమయం ఆలస్యం కావడంతో…ఇంత ఆలస్యం ఎందుకయ్యిందంటూ విద్యార్ధినిలపై ప్రిన్సిపాల్ శివమెత్తింది. ప్లాస్టిక్ పైప్‌తో ఇద్దరినీ చితకబాదింది.దీంతో విద్యార్ధులు ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయారు. ఒంటిపైన గాయాలు పొంగాయి.దీంతో హుటాహుటిని ఇద్దరు విద్యార్ధినిలను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారిస్తున్నారు.