తంబీలను వదలని వర్షాలు
తమిళులపై వరుణుడు పగబట్టాడా అనుకునేంతగా భీకర వర్షాలు కొనసాగుతున్నాయి.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక అతి భారీ వర్షాలు ,తుఫానులు తమిళనాడుని వణికించడం ఇది మూడో సారి.ఇప్పటికే రెండు సార్లు కురిసిన భారీ వర్షాలు,తుఫాన్ల ధాటికి చెన్నై సహా ఆ రాష్ట్రంలోని ప్రధాన నగరాలన్నీ అతలాకుతలమయ్యాయి. తాజాగా మరో తుఫాను బీభత్సం సృష్టించడంతో తమిళనాడు తీర ప్రాంతాలన్నీ చిగురుటాకులా వణికి పోతున్నాయి.జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.వీధులన్నీ జలమయమయ్యాయి. చిన్నపాటి బెలూన్ బోట్లు వేసుకుని సహాయక చర్యలు చేపట్టాలసిన దుస్థితి దాపురించింది.మరో 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై, మదురై,సేలం సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది.
10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడు ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

