Home Page SliderInternational

ఇది ప్రపంచాన్ని వణికించే స్నేహం

మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మన ప్రవర్తన,జీవనశైలి అనేది మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది. అందుకే మన స్మేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే మంచి వారితో స్నేహం మన విలువల్ని పెంచితే..మూర్ఖులతో స్నేహం మనకి అలాగే మన చుట్టుపక్కన ఉన్నవారందరికీ ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం ఓ రెండు దేశాలను పాలించే అధ్యక్షుల స్నేహం ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే వారిలో ఒకరు పాశ్చాత్య దేశాలకు చెమటలు పట్టించే నేత అయితే మరొకరు నియంతృత్వ పాలనతో ప్రపంచాన్ని సైతం నివ్వెరపోయేలా చేసిన వ్యక్తి. వీళ్లే రష్యా అధ్యక్షుడు పుతిన్,ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. అయితే వీరిప్పుడు చేయి చేయి పట్టుకొని తిరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. వీరి స్నేహంతో ముఖ్యంగా అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎందుకంటే వీరు అమెరికాకు చెక్ పెట్టాలని సైనిక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరి స్నేహం ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని సర్వత్రా ఆందోళన నెలకొంది.