చరిత్ర సృష్టించనున్న ఇస్రో..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త చరిత్ర లిఖించనుంది. రేపు ఉదయం 6.23 నిమిషాలకు తన వందో ప్రయోగానికి సిద్ధమయ్యింది. శ్రీహరికోటలోని షార్‌లో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ను లాంచ్ చేయబోతున్నారు. దీనిద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. ఈ శాటిలైట్ దాదాపు 2,250 కేజీల బరువు ఉంటుంది. ఈ శాటిలైట్‌ను 36,000 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ప్రయోగం ద్వారా దేశ నావిగేషన్ సిస్టం పనిచేస్తుంది. ఈ ప్రయోగాన్ని ఇస్రో యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ఉదయం 5.50 నుండి చూడవచ్చని పేర్కొన్నారు.