అవనిగడ్డలో ఐసిస్ డ్రగ్
ప్రపంచ దేశాలకు ఒకప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఐసిస్ తీవ్రవాద సంస్థ గురించి బహుశా తెలియనివారంటూ ఉండరేమో.అలాంటి ఉగ్రవాద సంస్థ రెగ్యులర్‌గా వినియోగించే డ్రగ్….మన ఏపిలోని అవనిగడ్డలో భార్గవ్ మెడికల్ షాపులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఉగ్రవాదులు….ఎక్కువ సేపు నిద్రపోకుండా ఉత్తేజంగా ఉండేందుకు ఈ ఉత్ప్రేరకాలు వాడుతుంటారు.వాటిని గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దాదాపు 22,244 క్యాప్సూల్స్ అమ్మినట్లు పోలీసులు నిర్దారించారు.భార్గవ్ మెడికల్ షాపుపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు.
