Home Page SliderInternationalSports

తొలి సెంచరితో అదరగొట్టిన ఇషాన్‌  కిషన్‌  

ఛాటోగ్రామ్‌ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్‌, టీమిండియా మూడో వన్డేలో టాస్‌ గెలిచిన బంగ్లా బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి, సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ కాకుండా చూసుకోవాలని టార్గెట్‌ పెట్టుకుంది. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం అయిన రోహిత్‌ శర్మ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీగా నియమించారు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ సెంచరితో అదరగొట్టేశాడు. బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొనీ మరీ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్‌ 16 ఫోర్లు, 6 సిక్సర్లతో తన కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. మరోవైపు విరాట్‌ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణిస్తున్నాడు. భారత్‌ భారీ స్కోరు దిశగా పరుగులను జోడిస్తోంది. ప్రస్తుతం భారత్‌ 27 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 205/1 పరుగులు చేసింది.