Home Page SliderNational

విజయ్ దళపతి “లియో”లో.. గ్లోబల్ స్టార్ నిజమేనా?

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటిస్తోన్న సినిమా “లియో”.ఇటీవల ఈ సినిమా నుంచి “నా రేడీ” సాంగ్ రిలీజ్ అయ్యింది. కాగా ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తూ..ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అయితే ఈ సినిమా నుంచి మరో క్రేజీ న్యూస్ నెట్టింట చెక్కర్లు కొడుతోంది. కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలకమైన క్యామియో రోల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే హీరో విక్రమ్ సినిమాలో హీరో సూర్య చేసిన “రోలెక్స్” పాత్రను మించి లియోలో రామ్‌చరణ్ క్యారెక్టర్ ఉంటుందని టాక్ నడుస్తోంది. కాగా ఈ న్యూస్‌ను చరణ్ అభిమానులు ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.