పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ అందుకేనా?
టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నేడు భేటీ అయ్యారు. ఆయన నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. హీరో రామ్ చరణ్ నటించిన ఈ చిత్రానికి ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు కోసం చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి. మరోపక్క తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే కనీసం ఏపీలో అయినా ఈ లాభం సాధించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంతేకాక జనవరిలో విజయవాడలో ఈ చిత్రం మెగా ఈవెంట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. దీనికి అనుమతుల కోసం పవన్ కళ్యాణ్‌ను అనుమతులు కోరే అవకాశం ఉంది.