ఈ నెంబర్ ఫోన్లను లిఫ్ట్ చేస్తున్నారా…?
అపరిచితుల నుండి వచ్చే ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 11 నెంబర్లతో కూడిన ఫోన్ నెంబర్లు, 371, 375, 381, 5 63, 370, 255 వంటి కోడ్‌లతో మొదలయ్యే ఫోన్లు ఎత్తితే చాలా ప్రమాదమని హెచ్చరించారు. ఎందుకంటే అవి లాత్వియా, బెలారస్, సెర్బియా, లోవా, టాంజానియా వంటి దేశాల నెంబర్లతో వచ్చే ఫోన్లు అని, వాటికి తిరిగి ఫోన్ చేస్తే కాంటాక్ట్స్ జాబితాతో పాటు బ్యాంకు వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలు వెంటనే కాపీ చేసుకుంటారని పేర్కొన్నారు. పైగా 90 లేదా 09 నంబర్లు నొక్కాలని సూచిస్తే అలా చేయవద్దన్నారు. అలా చేస్తే మీ సిమ్ కార్డును యాక్సెస్ చేయడానికి, కాల్స్ చేయడానికి, మిమ్మల్ని నేరస్థునిగా చేయడానికి కుట్రలు జరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయవద్దని, వారేదైనా నెంబర్ ప్రెస్ చేయమని చెప్తే చేయకూడదని పేర్కొన్నారు.

