Andhra PradeshHome Page Slider

ఏపీకి తుఫాను ముప్పు తప్పదా?

ప్రస్తుతం ఏపీని అకాల వర్షాలు అతాలకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మరో రెండు రోజుల్లో ఏపీకి తుఫాను ముప్పు తప్పదని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. కాగా ఇప్పటికే బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన ద్రోణి మరో రెండు రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అయితే దీనికి “మోచా తుఫాను”గా నామకరణం చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని రైతులందరు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. వీలైనంత వరకు రానున్న ఐదు రోజుల్లో ధాన్యాన్ని బయట ఆరబోయడం,కుప్పలు చేయడం వంటి వాటిని చేయొద్దని తెలిపింది. తుఫాను కారణంగా పంట పొల్లాల్లోని పంటను దెబ్బతినకుండా కాపాడలేమని కాబట్టి ఇప్పటికే చేతికి వచ్చిన పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలని రైతులకు సూచించింది. అంతేకాకుండా ఏపీలో మత్సకారులు కూడా తుఫాను నేపథ్యంలో చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.