HealthHome Page SliderInternational

మగజాతి అంతరించిపోతుందా? భయపెడుతున్న రిపోర్ట్

ఎవరైనా అబ్బాయిల్ని పొగిడేటప్పుడు మగజాతి ఆణిముత్యం రా అని అంటుంటాం కానీ భవిష్యత్తులో ఈ డైలాగ్ వినపడకపోవచ్చు. అందుకు కారణం అలాంటి ఆణిముత్యాలకు కొరత ఏర్పడి కాదు.. అసలు మగజాతే అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అవును మగజాతి మనుగడ ప్రమాదంలో పడింది. వై క్రోమోజోమ్స్ సంఖ్య తగ్గిపోవడమే ఇందుకు కారణం. ఇంతకీ ఈ Y క్రోమోజోమ్స్ అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు.

DNA లో భాగమైన క్రోమోజోమ్స్ రెండు రకాలుగా ఉంటాయి. X క్రోమోజోమ్స్, మరొకటి Y క్రోమోజోమ్స్. మహిళల్లో రెండు X క్రోమోజోమ్స్ ఉంటే మగవారిలో X,Y క్రోమోజోమ్స్ లు ఉంటాయి. శిశువు మగ బిడ్డగా రూపొందడంలో ఈ Y క్రోమోజోమ్స్ కీలకంగా వ్యవహరిస్తాయి. గర్భంలో శిశువు పురుడు పోసుకున్న 12 వారాల తర్వాత ఇవి పని చేయడం ప్రారంభిస్తాయి. ఇందులోని మాస్టర్ జన్యువు శిశువులలో జననేంద్రియాలు రూపొందేలా చేస్తుంది. టెస్టిస్ రూపొందగానే దీని ద్వారా మేల్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ మాస్టర్ జన్యువుని SRY అని కూడా పిలుస్తారు.

Y క్రోమోజోమ్స్‌లో ఎక్కువ భాగం రిపిటీటివ్ ‘జంక్ DNA’ తో రూపొందుతుంది. ఇంత కీలకమైన Y క్రోమోజోమ్స్‌లో 166 మిలియన్ల సంవత్సరాల క్రితం 900 కు పైగా జన్యువులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 55 కి పడిపోయింది. 10 లక్షల సంవత్సరాలకి ఐదు జన్యువుల చొప్పున అంతరించిపోతున్నాయట. ఈ లెక్కన మరో 11 మిలియన్ సంవత్సరాలలో మిగిలిన 55 జన్యువులు కూడా అంతరించి పోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్రోమోజోమ్స్ అంతరించిపోతే మగజాతి మనుగడ కూడా కష్ట మేనని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ రీసెర్చ్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. X ప్లాట్ ఫామ్‌లో తాజా నివేదికపై చాలామంది పోస్టులు చేస్తున్నారు. భవిష్యత్తులో ‘మగ పిల్లలు పుట్టరు’ అని మీమ్స్ పోస్ట్ చేశారు. దీనికి ‘బేటా బచావో’ అని క్యాప్షన్ యాడ్ చేశారు.