మోహన్ బాబు, మనోజ్‌ల మధ్య వివాదం ఆ ఇంటికోసమేనా..?
సినీనటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్‌ల మధ్య వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. అవి ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీసు కేసులు పెట్టుకునేంత వరకూ వెళ్లింది. అయితే ఈ గొడవలు శంషాబాద్‌లో ఉన్న మోహన్ బాబు ఇంటికోసమే అని తెలుస్తోంది. శంషాబాద్ సమీపంలోని జల్‌పల్లిలో తన శేష జీవితం గడపడానికి పెద్ద బంగళా నిర్మించుకున్నారు మోహన్ బాబు. కొన్ని ఎకరాల స్థలంలో ఇది విస్తరించింది. తోటలు, గార్డెన్లు, స్విమ్మింగ్ ఫూల్స్ వంటి ఆధునిక సౌకర్యాలతో నాలుగంతస్తుల భవనం ఇది. ఈ ఇంటిపై ఆయన కుమార్తె మంచు లక్ష్మి గతంలో హోమ్ టూర్ వీడియో కూడా చేశారు. ఫిల్మ్ నగర్‌లో ఆయనకు ఉన్న ఇల్లు కుమార్తె మంచు లక్ష్మికి ఇచ్చారని, ఇప్పుడు జల్‌పల్లిలో ఉన్న ఇల్లు తనకు కావాలని మనోజ్ అడుగుతున్నట్లు సమాచారం. అయితే తమ కుటుంబ సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని పెద్దకుమారుడు విష్ణు చెప్తున్నారు. ఆయన దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. మోహన్ బాబుతో కలిసి జల్‌పల్లిలోని ఇంటికి నేరుగా చేరుకున్నారు.

