అల్లు ఇంటిపై దాడి సీఎం స్పాన్సర్డా?
సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి అత్యంత హేయమైన చర్యని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇంటిపై దాడి జరిగిన కొద్ది గంటల తర్వాత ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.ఇది కాంగ్రెస్ పార్టీ తరుఫున చేసిన ఆందోళనా లేదా సీఎం స్పాన్సర్డా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.ఈ దాడితో కళాకారులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతలో డొల్లతనాన్ని తేటతెల్లం చేసిందన్నారు.అల్లు అర్జున్‌కి తమ పార్టీ తరుఫున ఎప్పుడూ మద్దతు ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇలాంటి స్పాన్సర్డ్ దాడులతో తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు.