Home Page SlidermoviesNational

పుష్ప 2 ఐటమ్ గాళ్ ఖరారయ్యిందా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రం అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా పుష్ప ది రైజ్‌లో ఐటమ్ సాంగ్‌ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ చిత్రం షూటింగ్ అంతా పూర్తయ్యాక, ఆ పాటకు హీరోయిన్ సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే ఇప్పుడు పుష్ప 2 చిత్రం కూడా షూటింగ్ అంతా పూర్తయినా, ఇంకా ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో డైరక్టర్ సుకుమార్ బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేద్దామని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కృతిసనన్, త్రిప్తి డిమ్రీ వంటి పేర్లు మొదట్లో వినిపించినా ఇప్పుడు స్త్రీ 2తో సంచలన విజయం సాధించిన హీరోయిన్ శ్రద్ధాకపూర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఆమె అయితే బాలీవుడ్‌లో క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు.