Home Page SliderInternational

క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కడానికి కోహ్లినే కారణమా..

క్రికెక్‌కు ఒలింపిక్స్‌లో చోటు దొరికిందని వార్త రాగానే, ప్రపంచ క్రికెట్ అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే దీనికి విరాట్ కోహ్లి కారణమా అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా లాస్ ఏంజెల్స్ 2028 నిర్వాహక కమిటీ క్రీడా డైరక్టర్ నికోలో కాంప్రియానే పేర్కొన్నారు. ఆయన ప్రపంచ వేదికపై క్రికెట్‌ను ప్రకటిస్తూ కోహ్లి గురించి వ్యాఖ్యలు చేశారు. నా స్నేహితుడు విరాట్ కోహ్లికి సామాజిక మాధ్యమాల్లో 34 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అత్యధిక ఫాలోవర్లు గల మూడవ అథ్లెట్. లెబ్రాన్ జేమ్స్, టామ్ బ్రాడీ, టైగర్ వుడ్స్ వంటి మేటి క్రీడాకారుల ఫాలోయర్స్ కంటే కోహ్లికి ఉండే ఫాలోవర్లు ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. దీనితో విరాట్ కోహ్లి క్రికెట్‌కే ముఖచిత్రంగా మారాడంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది.