Breaking NewsHome Page SliderPoliticsTelanganatelangana,

‘వార్షికోత్సవం అయ్యిందా..?’ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసులో సుప్రీం జడ్జి..

ఏడాది గడిచినా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ విమర్శించారు. తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై వాదనల సందర్భంగా ఆయన వార్షికోత్సవం అయ్యిందా అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. తాము ఏడాది కిందట ఫిర్యాదు చేసినా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదని బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేశామని, వారిలో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ తరపున లోకసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడారని, అయినా కూడా బీఆర్‌ఎస్‌లోనే ఉంటున్నట్లు చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించినా స్పీకర్ పట్టించుకోలేదన్నారు. దీనితో సుప్రీంకోర్టును ఆశ్రయించామని వారు పేర్కొన్నారు. కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని ప్రతివాదులు కోరగా, ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఎంతకాలం పడుతుందని ప్రశ్నించింది.