Home Page SliderNational

రైల్వే ట్రాక్ లో ఇనుపరాడ్డు.. తప్పిన పెను ప్రమాదం

బిహార్ లోని పూర్నియా జిల్లాలోని రాణి పాత్ర రైల్వేస్టేషన్ సమీపంలో నిన్న అర్ధరాత్రి కటిహార్ నుంచి జోగ్బని వెళ్తున్న డీఎంయూ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలపై ఇనుపరాడ్డు పెట్టగా అది చక్రాల్లో ఇరుక్కోవడంతో రైలు ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే లోకోపైలట్ సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ బ్రేకు ఉపయోగించి ట్రైను ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. దుండగులు రైల్వే ట్రాక్ పై కావాలనే ఇనుపరాడ్లు వేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో కనిపించాయి. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. నిందితులను త్వరలో గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.