ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన ఇరాన్ అధ్యక్షుడు..
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసినట్టు ఇంటెలిజెన్స్ సమాచారం వెల్లడైంది. జూన్ 15న టెహ్రాన్‌లోని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు ఐఆర్‌జీసీ అనుబంధ ఫార్స్ న్యూస్ తెలిపింది.ఈ దాడిలో అధ్యక్షుడు పెజెష్కియన్ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. కాలికి గాయమైయిందని చెబుతున్నారు. టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలోని ఓ భవనంపై జరిగిన ఈ దాడిలో, కింది అంతస్తులో ఉన్న అధికారులు సురక్షితంగా బయటపడినట్టు పేర్కొన్నారు.తనపై దాడి జరిగిన విషయాన్ని స్వయంగా అధ్యక్షుడు కూడా ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు. “వారు ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు” అని తెలిపారు. పేలుడు తర్వాత విద్యుత్ సరఫరా నిలిచినప్పటికీ, అత్యవసర వ్యవస్థలతో భవనం లోపలున్న వారిని సురక్షితంగా తరలించినట్టు వెల్లడించారు.