Home Page SliderNationalNews AlertSports

ఐపీఎల్ మళ్లీ షురూ..కోహ్లికి బిగ్ సర్‌ప్రైజ్

భారత్, పాక్ యుద్ధ వాతావరణం కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల విరమణ జరగడంతో ఈ ఐపీఎల్ సీజన్‌ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు వీటిని మే 17 నుండి 27 వరకూ లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయని ప్రకటించింది. వీటిలో మొదటిగా శనివారం మే,17న బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య బెంగళూరులో జరగనుంది. ఈ స్టేడియంలో రిటైర్‌మెంట్ ప్రకటించిన కింగ్ కోహ్లికి సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. కోహ్లికి సన్మానం చేయాలని ఐపీఎల్ బెంగళూర్ టీమ్ భావిస్తుండగా, అభిమానులంతా వైట్ టీ షర్ట్స్‌ ధరించి కోహ్లికి వీడ్కోలు ఇవ్వనున్నారు. మే 29న క్వాలిఫయిర్ 1జూన్1న క్వాలిఫయిర్ 2 జరగనున్నాయి. గెలిచిన టీమ్‌లకు జూన్ 3న ఫైనల్స్ జరుగుతుంది.