ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ మార్పులు..
ఐపీఎల్ మ్యాచ్‌లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కీలక మార్పులను ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై సైనికుల వేషాలలో వచ్చి దాడి చేయడం ఈ దాడిలో 30 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ దాడికి నిరసనగా నేడు జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో రెండు జట్ల ఆటగాళ్లు నల్లటి బ్యాండ్‌లు ధరిస్తారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మృతులకు నివాళులర్పిస్తూ నిమిషం పాటు మౌనం పాటిస్తారు. చీర్ లీడర్లు కూడా నేడు ప్రదర్శన ఇవ్వరు. అలాగే బాణసంచా కూడా రద్దు చేశారు. ఈ దాడికి నిరసనగా నేడు జమ్మూ కశ్మీర్‌లో బంద్ పాటిస్తున్నారు.

