ఐపీఎల్‌తో అదిరిపోయే ఆదాయం
జియో హాట్‌స్టార్ వేదికగా ఐపీఎల్ 2025 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. జియో హాట్‌స్టార్ ఇప్పటికే 100 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. ఐపీఎల్ మొదలైన తర్వాత కోట్ల మంది వీక్షకులు పెరిగినట్లు, సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయని ప్రకటించింది జియో. హాట్ స్టార్, జియో సినిమా విలీనం తర్వాత ఏకంగా రూ.పదివేల కోట్ల పైగానే ఆదాయం వచ్చినట్లు సమాచారం. పైగా యూజర్లను ఆకట్టుకునేందుకు పలు రకాల ప్యాక్‌లతో సందడి చేస్తోంది జియో. అయితే కొంతమంది యూజర్లు క్వాలిటీ విషయంలో ఆరోపణలు చేస్తున్నారు.