పెట్టుబడులు రావు….డిపాజిట్లూ రావు
ఏపి మాజీ సీఎం వైఎస్ జగన్ టిడిపిపై కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రెస్ మీట్లో ఓ రిపోర్టర్ దావోస్ పెట్టుబడుల సంగతి ప్రస్తావించగా…అక్కడ నుంచి పెట్టబడులు రావు..టిడిపికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లూ రావు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.రాజకీయ నాయకుడు అనే వాడు ఒక మాట చెప్తే దానికి విలువ,విస్వసనీయత ఉండాలన్నారు.అది లేనప్పుడు పాలించే అర్హత ఉండబోదన్నారు. సూపర్ 6,సూపర్ 7లు ఎక్కడైనా మీకు కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.తాము ఏనాడు ప్రతిపక్ష పార్టీల నాయకులను చంద్రబాబు మాదిరిగా కొనుగోలు చేయలేదన్నారు.దీనికి ఉదాహరణగా 2021లో జరిగిన మున్సిపల్,కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించిన చోట తాము టిడిపి వాళ్లను కొనుగోలు చేయలేదని, ఈ విషయాన్ని జేసి బ్రదర్స్ తమ పార్టీ విలువల గురించి గతంలో మాట్లాడారని ఫైల్ వీడియో ప్లే చేయించి గుర్తు చేశారు.

