ఆసక్తిగా జాన్వీకపూర్ ‘ఉలజ్’ ట్రైలర్
జాన్వీకపూర్ నటిస్తున్న ఉలజ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. జాన్వీకపూర్, గుల్షన్ దేవయ్య, రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్నచిత్రం ఉలజ్. దేశభక్తి కథాంశంతో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రమిది. సుధాన్షు సరియా దర్శకుడు. ఆగస్టు 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని మంగళవారం విడుదల చేసింది.