ఇంటర్ విద్యార్ధి మృతి
ఇంటర్ కాలేజిలో సెకండ్ ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతిచెందిన ఘటన కలకలం రేపింది.మేడ్చల్ జిల్లా బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థిని పూజిత(18) అనుమానస్పద స్థితిలో మృతి చెందింది.సమాచారం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేసి త్వరగా గాంధీ ఆసుపత్రికి రావాలని చెప్పారు.ముందుగా బాత్ రూంలో జారి పడిపోయిందని చెప్పి.. తర్వాత సూసైడ్ చేసుకుందని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.పూజిత మృతిని గోప్యంగా ఉంచి గాంధీ ఆసుపత్రికి తరలించడంతో మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

