నరసరావుపేటలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య నరసరావుపేటలో తీవ్ర కలకలాన్ని రేపింది. క్రైం పరంగా నిత్యం వార్తల్లో ఉండే నరసరావుపేట ప్రాంతంలోని భావనా కళాశాల హాస్టల్ లో ఉంటున్న ఓ విద్యార్ధిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది.తాను ఉండే హాస్టల్ భవనం పై నుంచి కిందకు దూకింది. దీంతో స్పాట్ లోనే మరణించింది. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. ఆత్మహత్య విషయం బహిర్గతమవడంతో కళాశాలకు హుటాహుటిన సెలవు ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు ,బంధువులు కళాశాల ప్రాంగణానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.పోలీసులు ఘటనా స్థలానికి విచ్చేసి పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

