ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తప్పనిసరి…!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సంచనమైన నిర్ణయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వివరించారు. అయితే, ఈ మార్పు వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి అమలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో, ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు యథాతథంగా రాయాల్సి ఉంటుంది. మార్చి 2025లో జరిగే పబ్లిక్ పరీక్షలలో ఎలాంటి మార్పులు ఉండవని, విద్యార్థులందరూ ఈ పరీక్షలకు సిద్ధమవ్వాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఇటీవల ఇంటర్ బోర్డు కొత్తగా ప్రతిపాదించిన సంస్కరణల ప్రకారం, పబ్లిక్ పరీక్షలకు బదులుగా అంతర్గత పరీక్షల విధానం వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయబడుతుంది. అంటే, ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు వార్షిక పరీక్షలు కాకుండా, కాలేజీలో నిర్వహించే అంతర్గత పరీక్షల ఆధారంగా గణన చేయబడతారు. ఇటు విద్యార్ధుల, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఇది ఒక పెద్ద మార్పు అవుతుంది. ఈ మార్పులపై విద్యార్థులు, పాఠశాలలు, కాలేజీలు మరింత వివరణ కోరుతున్నారు. అందువల్ల, ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తమ పరీక్షలకు సిద్ధం కావాలని, అయితే వచ్చే సంవత్సరంలో మార్పులపై ఇంకా స్పష్టతను పొందడం కచ్చితంగా అవసరం.