ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఇంటర్ పరీక్షలు 2024 ఫిబ్రవరి 28 నుండి మార్చి 18 వరకూ ఉండవచ్చని సమాచారం. ఫ్రీఫైనల్ ఎగ్జామ్స్ జనవరిలోనూ, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 1 నుండి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. మరో రెండు రోజుల్లో ఈ పరీక్షల టైమ్‌టేబుల్‌తో షెడ్యూల్ విడుదల చేయవచ్చు. పదవ తరగతి పరీక్షలు కూడామార్చి 18 నుండి ఉండవచ్చని తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలను నిర్వహిస్తారు. ఫస్టియర్‌కు ఒకరోజు, సెకండ్ ఇయర్‌కు మరోరోజు చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కొత్తగా మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. అంటే వారికి స్పోకెన్ ఇంగ్లీషులో ప్రాక్టికల్స్ ఉండవచ్చు. దీనితో ఇంగ్లీషు పేపర్ 80 మార్కులకు మాత్రమే ఉంటుంది. దీనితో విద్యార్థులకు ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్, వార్షిక పరీక్షలతో కూడిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. పదవ తరగతి పరీక్షల పైనా కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాజా సమాచారం ప్రకారం మార్చి 18 నుండి మార్చి చివరి వారం వరకూ పరీక్షలు ఉండవచ్చు.