4 మంథ్స్‌గా అవమానాలే.. అవమానాలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి మరోసారి తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇది తనకు సొంతిల్లు లాంటిదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని.. కానీ ఇప్పుడు తన అనుభవమే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక అశక్తుడిలా మారిపోయానని.. నాలుగు నెలలుగా అవమానాలకు గురువుతున్నానని బయటపడ్డారు. నేనూ కాంగ్రెస్ నాయకుడినే అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు.

