NationalNews Alert

త్వరలో INS VIKRANTH ఆగమనం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు అయిన యుద్ధనౌక INS VIKRANT  సెప్టెంబర్ 2 న భారత నౌకాదళంలో చేరబోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో దీనిని ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని భారత నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ ఎన్ ఘోర్మడే గురువారం తెలియజేసారు. ఇది మేడ్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేయబడింది. ప్రధాని మోదీ కొచ్చిలో జరిగే కార్యక్రమంలో పాల్గొని దీనిని అధికారికంగా నౌకాదళంలో ప్రవేశపెడతారు.

దీనిని ఏడాది కాలంగా అనేకరకాలుగా పరీక్షించారు. దీని బరువు దాదాపు 45వేల టన్నులు. దీనిలో దాదాపు 2300 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయని, 1700 మంది సిబ్బంది పనిచేస్తారని తెలిపారు. ఇది ఏకంగా 30 యుద్ధవిమానాలను మోయగలదు. ఇది 88మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిరాకతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల స్థిరత్వం పెరుగుతుందని భావిస్తున్నారు. నవంబర్ నుండి ల్యాండింగ్ పరీక్షలు ప్రారంభిస్తామని, ఇవి వచ్చే ఏడాది మధ్యనాటికి పూర్తవుతాయని తెలిపారు. వచ్చే సంవత్సరం చివరి నుండి INS VIKRANTH పూర్తిస్థాయిలో పనిచేస్తుందని తెలియజేసారు. దీని చిత్రాలు చూసేద్దామా..