Andhra PradeshHome Page Slider

ఆంధ్ర రోడ్ల పరిస్థితిపై వినూత్న నిరసనలు

ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి నానాటికీ తీసికట్టు అవుతోంది. దీనితో వివిధ ప్రాంతాలలో ప్రజలు వినూత్నంగా నిరసనలు చేపట్టారు. ఏలూరులో ఒక యువకుడు గుంతలు పడి వర్షం నీరు నిలిచిన గుంతలలో మంచం వేసుకుని పడుకున్నాడు. ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. ఈ వార్త వైరల్ అవడంతో అధికారులు అదరాబాదరా కంకర వేసి గుంతలు పూడ్చి పెట్టారు. మరోపక్క పార్వతీపురంలో రోడ్లపై నిలిచిన చెరువులా తయారైన రోడ్లపై వరినాట్లు వేసి వినూత నిరసన తెలియజేశారు కొందరు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే రోడ్లు గుంతలు పడి గతుకులమయంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు ఈమధ్య కురుస్తున్న భారీ వర్షాలకు రాష్టవ్యాప్తంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనితో తక్కువ దూరానికి కూడా ప్రయాణానికి గంటలకొద్దీ సమయం పడుతోంది.