Home Page SliderNational

‘భారత్‌లో ఆవిష్కరణలు కేవలం యువతకు మాత్రమే కాదు’- ఆనంద్ మహీంద్రా

ఒక వృద్ధుని సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. భారత్‌లో ఆవిష్కరణలు, స్టార్టప్‌లు కేవలం యువతకు మాత్రమే సొంతం కాదంటూ తన ట్విటర్‌లో ఒక వీడియోను పోస్టు చేశారు. అంతేకాదు, అతనికి వదోదరలో వర్కషాప్ కావాలంటే తన సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ వీడియోలో ఒక రిటైర్ అయిపోయిన ఒక వృద్ధుడు వ్యాయామం చేసేందుకు వీలు కల్పించే ప్రత్యేక సైకిళ్లను తయారు చేస్తున్నారు. అందరిలా రిటైర్ అయ్యాక, తీర్థయాత్రలతో కాలక్షేపం చేయకుండా తన ఆలోచనలతో సరికొత్త సైకిళ్ల తయారీకి పూనుకున్నారు గుజరాత్‌కు చెందిన సుధీర్ భావే.

ఆయన 40 ఏళ్ళపాటు ఒక ఉక్కు పరిశ్రమలో మెకానికల్ ఇంజనీరుగా పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం ప్రత్యేక నైపుణ్యాలను అలవర్చుకుని సైకిళ్లను తయారు చేశారు. తనకు సొంతంగా వర్క్‌షాప్ లేదని, ఇతర దుకాణాల సహాయం తీసుకునేవాడినని పేర్కొన్నారు. ఈ వీడియోను మహీంద్రా షేర్ చేస్తూ “మీ సృజనకు, శక్తికి నమస్కారాలు. భారత్‌లో మీలాంటి పెద్దవారు కూడా యువతతో సమానంగా ఆవిష్కరణలు చేయడం సంతోషం. మీకు మరిన్ని ప్రయోగాలకు వదోదరలో వర్క్‌షాప్ కావాలంటే నాకు తెలియజేయండి. మీరింకా రిటైర్ కాలేదు.మీలాంటి వాళ్లే దేశానికి కావాలి”  అని ప్రశంసించారు.