ఇండిగో బిగ్ ఆఫర్.. 2 వేలకే ఫ్లైట్ టికెట్
విమానం ప్రయాణం చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తమ ప్రయాణికుల కోసం స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 25 వరకు తగ్గింపు ధరలకే టికెట్లను అందించనుంది. జనవరి 15 నుంచి ఏప్రిల్ 14, 2023 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ టికెట్లు లభించనున్నాయి. డొమిస్టిక్ ప్రయాణానికి రూ. 2,023/-, ఇంటర్నేషనల్ ప్రయాణాలకు రూ. 4,999/- టికెట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో పాటు హెచ్‌ఎస్‌బిసి కస్టమర్స్‌కి అదనంగా క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఇండిగో ప్రకటించింది. అయితే.. టికెట్లు అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. విమానయాన రంగం మునుపటి కంటే పుంజుకుందని, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు.