Breaking Newshome page sliderHome Page SliderNational

ఇండిగోకు ₹58.75 కోట్లు ట్యాక్స్ పెనాల్టీ నోటీసు

విమానయాన సంస్థ ఇండిగోకు భారీగా ₹58.75 కోట్ల పన్ను జరిమానా నోటీసును ఢిల్లీ సౌత్ కమిషనరేట్‌లోని సెంట్రల్ GST అదనపు కమిషనర్ జారీ చేశారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ లెక్కల్లో గణనీయమైన లోపాలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించడంతో ఈ నోటీసు జారీ చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇండిగో స్పందిస్తూ — నోటీసు వివరాలను పరిశీలిస్తున్నామని, అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని తెలిపింది. ఇటీవల విమానాల రద్దు, ఆలస్యాల వివాదాలతో ఇండిగో ఇప్పటికే ఒత్తిడిలో ఉండగా, ఈ కొత్త పెనాల్టీ నోటీసు సంస్థపై మరింత భారం పెంచినట్లైంది.