పాక్‌పై భారత్ కీలక నిర్ణయం..
పాకిస్థాన్‌పై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌కు గుణపాఠం చెప్పడానికి ప్రపంచదేశాల మద్దతు కూడగట్టాలని ప్రయత్నిస్తోంది. నేడు మధ్యాహ్నం వివిధ దేశాల అంబాసిడర్లు, ముఖ్య అధికారులతో సైనిక చర్యల వివరాలను పంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. పహల్గామ్ దాడి అనంతరం పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాల ముందుంచి, దాని ఉగ్రవాద బుద్దిని ఎండగట్టడానికి నిర్ణయించుకుంది. మరో పక్క ఇది కేవలం బ్రేక్ మాత్రమేనని, మరోసారి ఉగ్రవాదులు చొరబడితే వారికి చుక్కలు చూపిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

