నిశ్చితార్థం చేసుకోబోయే వాడిని లారీలో తీసుకెళ్లిన యువతీ..
ఓ జంట కేరళలోని త్రిసూర్‌లో వెరైటీగా ఎంగేజ్‌మెంట్ వేడుక నిర్వహించారు. జిల్లాలోని మానలూరు చెందిన దలీషా డేవిస్ అనే యువతి కాబోయే భర్తను నిశ్చితార్థ వేడుకకు స్వయంగా లారీ డ్రైవ్ చేసుకుంటూ చర్చికి తీసుకెళ్ళింది. దీంతో నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. దలీషాకు చిన్నప్పటి నుంచి లారీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి డేవిస్ కూడా లారీ డ్రైవర్ కావడం వల్ల తన ఇష్టాన్ని మరింత పెంచుకుంది. కొన్ని సార్లు తండ్రి లేకుండా లారీ నడిపి కొచ్చి నుంచి పెట్రోల్ తీసుకొచ్చి బంకుకు సరఫరా చేసేది. ఆ సమయంలో ఆమె ట్యాంకర్ లారీ నడుపుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో గల్ఫ్ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ ఇచ్చింది. గల్ఫ్‌లో లారీ ట్యాంకర్ డ్రైవర్‌గా చేరిన సమయంలో జిల్లాలోని కంజిరపల్లిలోని డ్రైవర్ హంసన్‌తో యువతికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇరువురు కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలో స్థానిక చర్చిలో నిశ్చితార్థ వేడుకలను పెద్దలు ఏర్పాటు చేశారు. అయితే.. తన నిశ్చితార్థ వేడుకను కాస్త ప్రత్యేకంగా జరుపుకోవాలని ఆలోచించింది. కాబోయే భర్తను లారీలో తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది.

