సొంతగడ్డపై భారత్ ఘోర పరాజయం..
ఇండియా -న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌లో చివరకు భారత్ చేతులెత్తేసింది. భారత్ కేవలం 107 పరుగుల టార్గెట్ పెట్టడంతో సునాయాసంగా కివీస్ విజయం సాధించింది. ఓపెనర్లు అవుటయినప్పటికీ కేవలం రెండు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ విజయం నమోదు చేసింది. భారత్‌పై న్యూజిలాండ్ ఇండియాలో టెస్ట్ మ్యాచ్‌ను 1988లో గెలిచింది. అనంతరం ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే విజయం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అతి పేలవమైన ప్రదర్శనతో కేవలం 46 పరుగులకే ఆలౌట్ కావడంతో న్యూజిలాండ్‌కు సులభంగా విజయం చేకూరింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో కివీస్ ముందంజలో ఉంది.

