‘భారత్ స్టార్టప్‌లతో సవాల్ వద్దు చేసి చూపిస్తాం’ చాట్ జీపీటీ ఫౌండర్‌తో సవాల్ చేసిన భారత సీఈఓ
భారత దేశ స్టార్టప్‌లకు పెద్ద నైపుణ్యం లేదని చాట్ జీపీటీ వంటి ఫౌండేషనల్ మోడల్‌ను తయారు చేయడం కష్టమన్నారు ఆ కంపెనీ సీఈవో శామ్ అల్టమన్. దీనికి ధీటుగా జవాబిచ్చారు టెక్‌మహీంద్రా సీఈఓ గుర్నాని.
భారత స్టార్టప్‌లపై విసిరిన ఈ సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని, భారత పారిశ్రామిక వేత్తలను, ఇంజనీర్ల మేథస్సును తక్కువ అంచనాలు వేయెద్దని, తాము చాట్ జీపీటీ తరహా మోడల్స్‌ను అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు.

ఇప్పటికే భారత్‌లోని కృత్రిమ మేధపై పరిశోధనలు జరుగుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ ఏఐ కి సంబంధించిన ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. దీనికోసం చాట్ జీపీటీని అభివృద్ది చేసిన ఓపెన్ ఏఐ అనే సంస్థ సీఈవో శామ్ ఆల్టమెన్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా గూగుల్ ఇండియా రంజన్ ఆనందన్ ఆయనను ప్రశ్నిస్తూ భారత్‌లో కూడా ఇలాంటి ఫౌండేషనల్ మోడల్ అభివృద్ధి చేయవచ్చా అని అడిగారు. దీనికి బదులిస్తూ భారత్ తమతో పోటీ పడలేదంటూ వ్యాఖ్యానించారు ఆయన. దీనికి సవాలుగానే టెక్ మహీంద్రా సీఈవో ఈ ట్వీట్ చేశారు.

