యూఎస్ నుండి వచ్చేస్తున్న భారతీయులు
అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇతర దేశాల నుండి వచ్చిన వలసదారులను సొంత ఖర్చులు పెట్టుకుని అయినా వారి వారి దేశాలకు పంపేస్తున్నారు. అలాగే ఇప్పుడు భారతీయులను కూడా తిరుగు టపాలో పంపించేస్తున్నారు. భారత్‌కు చెందిన 205 మంది అక్రమ వలసదారులతో అమెరికా మిలటరీ విమానం టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుండి భారత్‌కు బయలుదేరింది. భారతీయులు దాదాపు 18 వేల మంది అక్కడ అక్రమంగా నివసిస్తున్నారని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపింది. అలాగే సరైన ధృవపత్రాలు లేకుండా ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారని సమాచారం. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, వీసా గడువు ముగిసినా, సరై దస్త్రాలు లేకపోయినా అమెరికా నుండే కాదు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వారిని భారత్‌కు రప్పించడానికి వీలు కలిగిస్తామని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.


 
							 
							