తుఫాన్ కారణంగా బార్బడోస్‌లోనే భారత జట్టు
T20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ఇప్పటివరకు భారత్‌కి చేరుకోలేదు. ఎందుకంటే T20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ వెస్టీండీస్‌లోని బార్బడోస్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే బార్బడోస్‌ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్ (తుఫాన్)తాకనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ వర్షం కూడా మొదలైందని ఎయిర్‌పోర్ట్‌ను మూసివేసినట్లు తెలుస్తోంది. దీంతో భారత ఆటగాళ్లు హోటల్స్‌కే పరిమితమయ్యారని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు వారు మరో 24 గంటల వరకు అక్కడే ఉంటారని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.


 
							 
							