Home Page SliderInternationalviral

భారతీయ పెయింటింగ్ రూ.118 కోట్లు..

భారతీయ లెజెండరీ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మోడ్రన్ ఆర్డ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన క్రిస్టీ వేలంలో ఆయన ఆర్ట్ రికార్డు ధరకు అమ్ముడుపోయింది. 2023లో ముంబయిలో జరిగిన వేలంలో దాదాపు రూ.61.8 కోట్లు పలికిన పెయింటింగ్ పోలిస్తే ఇప్పుడు అదే పెయింటింగ్ రూ.118 కోట్లకు పైగా ధర పలికింది. గతంలో కూడా హుస్సేన్ పునర్జన్మ అనే పెయింటింగ్ రూ.25.7 కోట్లు. ఒకే కాన్వాస్‌లో 14 అడుగుల విస్తీర్ణంలో 13 చిత్రాలతో గ్రామ తీర్థయాత్ర అనే పెయింటింగ్ ఆయన చిత్రాలలో ప్రముఖంగా పేర్కొంటారు. మహారాష్ట్రలో జన్మించిన హుస్సేన్ ఇండియాలో టాప్ ఆర్టిస్టుగా పేరు పొందారు. గతంలో ఆయన హిందూ దేవతలపై వేసిన పెయింటింగ్స్ వివాదం కావడంతో, హత్యా బెదిరింపుల నేపథ్యంలో విదేశాలలో తలదాచుకున్నారు.