ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్
రాజస్తాన్లోని జైపుర్లో మార్చి 9 నుంచి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (IIFA Awards) జరగబోతోన్నాయి.అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఇండియాతో పాటు పలువురు హాలీవుడ్,ఆసియా అగ్రదేశాల తారలు రానున్నారు.దీంతో గట్టి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటినుంచే అక్కడికి సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు చేరుకుంటున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ముందుగానే చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆమె రాకతో అక్కడ సందడిగా మారింది.దక్షిణాది నుంచి తమిళనాడు,కేరళ రాష్ట్రాలకు చెందిన తారలు ఎయిర్ పోర్టుల్లో క్యూ కడుతున్నారు. కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉండటంతో తారల సందడితో ఎయిర్ పోర్టులు కళకళలాడుతున్నాయి.

