జీ20 దేశాల నివేదికలో భారతీయ బిలియనీర్ల దూకుడు
న్యూఢిల్లీ :భారతదేశంలోని కుబేరులు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాజాగా విడుదలైన జీ20 గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం, గత ఏడాదితో పోల్చితే భారత బిలియనీర్ల మొత్తం సంపద 62 శాతం పెరిగింది. ఇది అన్ని జీ20 దేశాల్లో మూడవ అత్యధిక వృద్ధి రేటుగా నమోదైంది. ఈ నివేదికను గ్లోబల్ ఎకనామిక్ ఫోరమ్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సంయుక్తంగా విడుదల చేశాయి.
వీరి లెక్కల ప్రకారం భారత్‌లోని బిలియనీర్ల మొత్తం నికర ఆస్తి విలువ 890 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 74 లక్షల కోట్లు. 2024లో ఇదే సంఖ్య 550 బిలియన్ డాలర్లుగా ఉండేది. అంటే కేవలం ఏడాదిలోనే 62 శాతం వృద్ధిపొందింది. భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ రంగం, మౌలిక సదుపాయాల పెట్టుబడులు వంటివి ఈదూకుడుకు ప్రైవేట్ రంగ దూకుడు ప్రధాన కారణాలు.
అని నివేదిక పేర్కొంది. భారతదేశం 2025 జీ20 లిస్ట్‌లో 6వ స్థానంలో నిలిచింది.మొదటి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్ ఉన్నాయి. అయితే వృద్ధి శాతంలో భారత్ టాప్ 3లో ఒకటి కావడం విశేషం
“భారతీయ బిలియనీర్ల సంపద పెరగడం దేశ ఆర్థిక ప్రగతిని సూచిస్తున్నప్పటికీ, ఆదాయ అసమానతలు కూడా పెరుగుతున్నాయి,” అని నివేదిక హెచ్చరించింది. సంపదలో 41 శాతం అధిక ఆదాయవర్గాల ప్రజలకు, ఒకశాతం పూర్తిగా కుబేరుల వద్ద, 50 శాతం దిగువస్థాయి వారి వద్ద ఉందని ఈ నివేదిక సూచిస్తోంది. 2.3 బిలియన్ల మంది ప్రజలు ఇంకా ఆహార భద్రతకు నోచుకోలేదని, సంపద కొందరి చేతులలో కేంద్రీకృతం చేయడం సామాజికంగా అన్యాయం చేయడమేనని, దీనిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.

